calender_icon.png 12 February, 2026 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లాండ్‌కు విండీస్ షాక్

12-02-2026 12:47:47 AM

ముంబై, ఫిబ్రవరి 11 : టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ స్కాట్లాండ్ పై గెలిచిన కరేబియన్ టీమ్ తాజాగా ఇంగ్లాండ్ కు షాకిచ్చింది. కొత్త ప్లేయర్స్‌తో నిండిన విం డీస్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లీష్ జట్టును 30 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలో నే డబుల్ షాక్ తగిలింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షైహోప్(0) నిరాశపరిచారు.

దీం తో విండీస్ కేవలం 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెట్ మెయిర్ (23), రోస్టన్ ఛేజ్ (34)ఆదుకున్నారు.  ఒకవైపు వికెట్లు పడుతున్నా రూథర్ ఫర్డ్ విధ్వం సకర ఇన్నింగ్స్ ఆడాడు. రూథర్ ఫర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్ల లో 196 పరుగులు చేసింది. వాంఖేడే స్టేడి యం ఛేజింగ్ పిచ్ కావడంతో ఇంగ్లాండ్ గెలుపు ఖాయమని చాలా మంది అంచనా వేశారు.

దానికి తగ్గట్టే  ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఔటైన తర్వాత జాకబ్ బెథెల్(33), బ్రూక్ (17) పరుగులకు ఔటవగా.. చివర్లో సామ్ కరన్ మెరు పులు మెరిపించాడు. ఇంగ్లాండ్‌ను గెలిపించేందుకు చివరి వరకూ అతను పోరాడినా పరుగుల అంతరం మాత్రమే తగ్గించగలిగాడు. దీంతో ఇంగ్లాండ్ 166 పరుగులు ఆలౌటైంది. సామ్ కరన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గ్రూప్ సిలో వెస్టిండీస్ 2 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా ఒక విజయం, ఒక ఓటమితో రెండో ప్లేస్ లో నిలిచింది.