10 May, 2026 | 12:59 AM

మాస్ యాక్షన్ వీరభద్రుడు

10-05-2026 12:00 AM

సూర్య హీరోగా నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’. ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్‌ను టీమ్ అధికారికంగా వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించింది. మే 14న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు; యాక్షన్: అన్బరివ్ విక్రమ్ మోర్; ఎడిటర్: ఆర్ కళైవానన్; ప్రొడక్షన్ డిజైన్: అరుణ్ వెంజారామూడు.