సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
28-08-2026 11:32 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాఖీ కట్టారు. రాఖీ పండగ సందర్భంగా కొండా సురేఖ(Minister Konda Surekha), సీతక్క సీఎం నివాసానికి వెళ్లారు. పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ తొలి సారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ మహిళా నాయకులు సీఎం రాఖీ కట్టారు. మలక్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాల అంథ విద్యార్థినులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఇటీవల వివాదం నేపథ్యంలో రేవంత్–సురేఖ భేటీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.






