7 August, 2026 | 8:48 AM

వైఎస్సార్ విగ్రహానికి ఘననివాళి

03-09-2025 12:00 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఘట్ కేసర్ మున్సిపల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిoడ్ల ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ చిత్రపటానికి అలాగే అంకుషాపూర్ లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సి.హెచ్. మచ్చేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, మీసాల సుధాకర్ రావు, బర్ల దేవేందర్, వి.బి. వెంకట్ నారాయణ, బొక్క సత్తిరెడ్డి, ఖయ్యూం, కవాడి మాధవరెడ్డి మేడబోయిన జంగయ్య, మెరుగు నరేష్ గౌడ్, డొంకెని శంకర్ గౌడ్, వేముల సత్తయ్యగౌడ్, ఎస్సీ సెల్ బిబ్లాక్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.