5 June, 2026 | 1:10 AM

అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

05-06-2026 12:00 AM

కేఎస్‌ఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు

దగ్ధమైన 20 షాపులు 

క్రమంగా పక్కనున్న షాపులకు అంటుకున్న మంటలు

ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది 

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం!

సికింద్రాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ అమీర్‌పేట్ మెయిన్ రోడ్డులో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్వర్ణజయంతి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కేఎస్‌ఆర్ షా పింగ్ కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అకస్మికంగా మంటలు చెలరేగాయి. మెట్రో పిల్లర్ నంబర్ 1043కి సమీపంలో ఉన్న ఈ భవనంలో మంటలు క్షణాల్లో వ్యాపించాయి.

పక్కనే ఉన్న హర్షమెస్‌కు మంటలు వ్యాపించి, దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్ మొ త్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కేఎస్‌ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి దగ్ధమైంది. భవనం మూడు అంతస్తుల్లో ఉన్న సుమారు 20 షాపులు కాలిపోయాయి. మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్న దుకాణాలన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి.

మండే ఎండలకు మంటలు తోడవడంతో చుట్టుపక్కల ఉన్న షాపులకు వేగంగా మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అంద రూ వారి వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కాంప్లె క్స్‌లో ఎక్కువగా బట్టల దుకాణాలు ఉండటం వల్ల మంట ల వేగంగా పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ లు వ్యాపించడంతోకిలో మీటర్ల దూరానికి కనిపించడంతో చుట్టుపక్కల భవనాల్లోని ప్రజలు, వ్యాపారులు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు పెట్టారు.

ప్రమాదం జరిగిన భవనంలో 10 ట్రావెల్స్ ఆఫీసులు, 5 కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించిన మంటలను ఆరు ఫైరింజన్ల సాయంతో అదుపులోనికి తీసుకొచ్చారు. వారికి హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహకరించాయి. కాగా ప్రాథమిక స మాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పెద్ద ప్ర మాదం తప్పిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. 

ప్రయాణికుల ఆందోళన

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు కేవలం 100 అడుగుల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదం కారణంగా అమీర్‌పేట మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆయా మార్గాల్లో సిటీ బస్సులను ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా నిలిపి చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. కాగా 1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు అగ్నిసెగలు తాకడంతో పగుళ్లు ఏర్పడినట్టు తెలిసింది.