మినరల్స్ రంగంలో సంస్కరణలు
శాటిలైట్ కేంద్రం ప్రారంభంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బ్రిటిష్ పరిశ్రమలు పెట్టుబడులు పెంటేందుకు ముందుకు రావాలి
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): మినరల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభు త్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపడుతోందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. పారదర్శకంగా ఈ- ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడం తో పాటు, జూనియర్ మైనింగ్ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తోందన్నారు.
2025లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ కేంద్రం ప్రా రంభమైంది. గురువారం భారత్ క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ (జీఎస్‌సీవో) శాటిలైట్ కేంద్రాన్ని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి యూకే ఫారిన్ సెక్రటరీ ఇవెట్ కూప ర్‌తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేకు ఉన్న మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాల వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో ఈ అబ్జర్వేటరీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిటికల్ మినరల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఎదుగుతుందన్నారు.
పరిశ్రమలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు ఈ అబ్జర్వేటరీ విలువైన సమాచారం అందిస్తుందన్నారు. క్రిటి కల్ మినరల్స్ రంగంలో స్వావలంబనకు కేంద్ర ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఈ లక్ష్యంతోనే 4 బిలియన్ డాలర్ల జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించామని, మినరల్స్ వెలికితీత, ఎక్స్‌ప్లోరేషన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఇన్నొవేషన్స్ వంటి విషయాల్లో వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు.






