11 April, 2026 | 3:26 AM

కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

11-04-2026 01:31 AM
  1. భయపడి బయటకు పరుగులు తీసిన కార్మికులు
  2. గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో ఘటన

జిన్నారం/అమీన్‌పూర్, ఏప్రిల్ 10(విజయక్రాంతి) : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శుక్రవారం న్యూ ట్రల్ కెమికల్ ఇండస్ట్రీస్ డిస్టిలేషన్ ప్లాంటులో అగ్ని ప్రమాదం సం భవించింది. కార్మికులు, స్థానికులు భయందోళనకు గురయ్యారు. రెండు కిలోమీటర్ల వరకు కమ్ముకున్న పొగ తో ఉక్కిరిబిక్కిరయ్యారు. రవాణా రాకపోకలకు అంతరాయం ఎదురైం ది.

గడ్డపోతారం పరిశ్రమలకు ఆనుకొని ఉండడంతో గాలి కాలుష్యం పెరి గి శ్వాస తీసుకోవడంలో వృద్ధులు, చిన్నారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘాటు రసాయన వాసనలు వ్యాపించడంతో భరించలేక కార్మికులు బయటకు పరుగులు తీశా రు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్ని మాపక సిబ్బం ది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసు కొచ్చారు. ష్రార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉం డవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే కంపెనీలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని, ఇం డస్ట్రియల్ ఏరియా పేరుతో నిబంధనలు పాటించకుండా కెమికల్ కంపెనీలు ఇష్టారీతి గా వెలిశాయని స్థానికులు విమర్శిస్తున్నారు.ప్రమాదంలో ప్రాణనష్టం జర గలేదు. కాగా ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.