31 May, 2026 | 7:39 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

06-04-2026 12:00 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 5 ( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని ఆయా వార్డులోని టిఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు డిసిసి జిల్లా అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజా రంజక పాలనను ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు పేర్కొన్నారు. 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో  పాటు సుమారు 30 మంది యువకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, యువకులు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.