31 May, 2026 | 6:48 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

క్రీడల్లో గెలుపు ఓటమి సహజం

06-04-2026 12:00 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

బాలానగర్, ఏప్రిల్  5 : క్రీడల్లో గెలుపు ఓటమి లు సహజమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన మన బాలానగర్, రాజాపూర్ క్రికెట్ లీగ్  బహుమతుల ప్రదానం కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేత జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. యువత క్రీడల్లో ప్రతిభ కనబరచి ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు ఉన్నారు.