మోదీ సభకు భిక్కనూర్ నుంచి భారీగా బీజేపీ నాయకుల తరలింపు
భిక్కనూర్, మే 10 (విజయక్రాంతి): హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు భిక్కనూర్ మండలం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (కేవీఆర్) పిలుపు మేరకు మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో ఈ తరలింపు జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ సభను విజయవంతం చేయడం కోసం కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ జే. లింగారెడ్డి, ఉపసర్పంచ్ గోల్కొండ శ్రీనివాస్ రెడ్డి, సీద్దరామేశ్వర్ నగర్ వార్డు సభ్యుడు పుట్నాల పవన్, భగీర్తిపల్లి వార్డు సభ్యుడు రాజ్కుమార్, గ్రామ అధ్యక్షుడు భాస్కర్, మీసాల ప్రవీణ్ గౌడ్, బల్ల లింగం, సుధాకర్ రెడ్డి, అభిషేక్, నవీన్, ప్రవీణ్ తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.






