‘పీఎంజే’ దొంగ అరెస్టు
- బెంగాల్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మిగిలిన నిందితుల కోసం గాలింపు
కరీంనగర్, మే 10 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని పీఎంజే నగల దుకాణం లో దోపిడీకి పాల్పడ్డ వారిలో ఒక నిందితుడిని పోలీసులు బెంగాల్‌లో అదుపు లోకి తీసుకున్నారు. దోపిడీకి పాల్పడిన నిందితులు బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. దోపిడీకి పాల్ప డ్డ నిందితుల్లో ఒకరిని పశ్చిమ బెంగాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తోపాటు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
దోపిడీ ముఠాకు వీరికి నార్త్ ఇండియాలో దొంగతనాలు, కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్లకు పాల్పడిన చరిత్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం పోలీసులు 16 ప్రత్యేక బృందాలతో బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. కాగా మే 3వ తేదీన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడి, కాల్పులు జరిపి భారీ గా బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి.






