calender_icon.png 9 December, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేల వైన్స్ షాప్‌లో భారీ చోరీ..

09-12-2025 12:17:44 AM

బేల, డిసెంబర్ 8 (విజయక్రాంతి): బేలా మండల కేంద్రంలోని శ్రీ దుర్గ వైన్స్ షాప్ లో గత రాత్రి దొంగలు పడ్డారు. గత నెలలో టెండర్ దక్కించుకున్న యజమాని వైన్స్ ప్రారంభించిన కేవలం వారం రోజులోనే దొంగతనం జరిగింది. షాప్ యాజమాని బాల్‌రాజ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వైన్స్ షాప్‌ను ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం... దొంగలు వైన్స్ వెనకాల ఉన్న వెంటిలెటర్‌ను తొలగించి లోనికి చొరబడ్డారన్నారు.

సీసీ కెమెరాలు పగల గొట్టి ఉండడంతో క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ లతో తనిఖీలు చేపట్టారు. షాప్‌లోని వస్తువుల పైనా వేలిముద్రాలను సేకరించారు. కౌంటర్ లోని రూ. 3 లక్షల 15 వేలు నగదుతో పాటు రూ. 20వేల మద్యం బాటిల్ చోరికి గురైయ్యాయని వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ తెలిపారు.