calender_icon.png 9 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవ ఎన్నికతోనే గ్రామాల్లో ఐక్యత

09-12-2025 12:19:31 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే గ్రామాల్లో ఐక్యత నెలకొంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా రాథోడ్ శీలబాయి, వార్డు మెంబర్లుగా అంబాజి, పడిగెల రాము లు, రేవతి, దాసరి రవళి లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కంటేగావ్ గ్రామ సర్పంచ్‌గా జాదవ్ సంజీవ్, ఉప సర్పంచ్‌గా సులోచన బాయి, వార్డు మెంబర్లుగా ఆడేం కవిత, జాదవ్ బలరాం, రాథోడ్ శంకర్, జాదవ్ సంతోష్, శంకరి, ఉమేష్, కుంరం గోదావరి లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సోమవారం వారిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.