గద్వాల జిల్లా కేంద్రంలో భారీ చోరీ
గద్వాల (వనపర్తి ), (విజయక్రాంతి ) : జిల్లా కేంద్రంలోని వేదనగర్ కాలనీ రాజయ్య తోట ఏరియాలో రెడ్ మేడ్ వ్యాపారి మిటుకుల ప్రతాప్ ఇంట్లో భారీగా బంగారం, నగదు, వెండి చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రతాప్, కుటుంబ సభ్యులు నిన్న గురువారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కర్నూల్ కు వెళ్లారు. సాయంత్రం ప్రతాప్ ఇల్లు ఇంటి ఇంటి మేయిన్ గేట్ తాళం ఉండి ఇంటి వాకిలి సగం తేరిచి ఉండడంను చుట్టు ప్రక్కల వాళ్లు గమనించి ప్రతాప్ కు పోన్ ద్వారా సమాచారాన్ని అందచేశారు. వెంటనే ప్రతాప్ ఇంటికి వచ్చి చూడగా మూడు బీరువాలు తెరిచి ఉండి అందులో వున్న సుమారు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు, 3,50,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు . ఈ చోరీ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గద్వాల్ పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.






