యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్: ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరి సొంతమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పతాంజలి యోగా సమితి, భారత స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవం లో యోగా చేసి అందరూ ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలోని స్టేడియం ఆవరణలో గల ఈత కొలను లో వేసవి శిక్షణా శిబిరం నందు స్విమ్మింగ్ శిక్షణ పొంది, స్విమ్మింగ్ లో మెలుకువలు నేర్చుకున్న విద్యార్థులకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్విమ్మింగ్ లో మంచి శిక్షణ ఇచ్చి విద్యార్థులను తయారు చేసిన శిక్షకుల ను అభినందనలు తెలియజేస్తున్నాను అని, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమలలో డివైఎస్ఓ శ్రీనివాస్, నిర్వాహకులు మథిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, వి.మనోహర్ రెడ్డి, పాండురంగం, ఎల్ గంగాధర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






