8 June, 2026 | 8:42 AM

మట్కా తుదిదశ షూటింగ్

13-09-2024 01:10 AM

వరుణ్‌తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మట్కా’ షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుత షెడ్యూల్‌లో కొనసాగుతున్న కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిస్తే, సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాఫీగా సాగుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్; డీవోపీ: ఎ కిషోర్ కుమార్.