calender_icon.png 15 October, 2024 | 11:15 PM

కానీ, అది తప్పు కాదు!

13-09-2024 01:12:20 AM

టాలీవుడ్‌లో కొంతకాలం పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రభావం ఇప్పుడు ఇక్కడ పూర్తిగా తగ్గింది. తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌తోపాటు చాలా చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా వినిపించే నెపోటిజం (బంధుప్రీతి) గురించి రకుల్ మాట్లాడటం గమనార్హం.

నెపోటిజంతో తాను కెరీర్ పరంగా నష్టపోయానని చెప్తూనే  అది తప్పు కాదంటూ పాజిటివ్ వ్యాఖ్యలు చేసింది. ‘నేను కూడా నెపోటిజం వల్ల బాగా నష్టపోయాను. అయితే నా దృష్టిలో నెపోటిజం అనేది తప్పు కాదు. నాకు రావలసిన చాలా అవకాశాలు స్టార్ కిడ్స్‌కు వెళ్లాయి. దీనివల్ల కెరీర్‌లో బాగా నష్టపోయా. అయితే ఆ విషయంలో నాకు బాధ లేదు. ఎందుకంటే అది వాళ్లకు రాసిపెట్టి ఉంది కాబట్టి అలా జరిగింది.

స్టార్ కిడ్స్‌కు అవకాశాలు సులభంగా వస్తాయి. అది వాళ్ల తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా దక్కిందని నేను భావిస్తా. కాబట్టి నెపోటిజం గురించి ఎక్కువ ఆలోచించను. భవిష్యత్తులో నా పిల్లలు చిత్ర పరిశ్రమలోకి రావాలంటే వాళ్లకు నా సహకారం ఉంటుంది కదా!’ అని తెలిపింది రకుల్. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు ‘దే దే ప్యార్ దే2’లో అజయ్ దేవగన్‌తో జోడీ కడుతోంది. ‘దే దే ప్యార్ దే’ చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని అన్షుల్ శర్మ తెరకెక్కిస్తున్నారు.