calender_icon.png 12 November, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

12-11-2025 12:08:40 AM

హనుమకొండ, నవంబర్ 11 (విజయక్రాంతి) : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జాతీయ విద్యా దినోత్సవం, స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.ఏ. గౌస్ హైదర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.     

హన్మకొండ గ్రంథాలయంలో...

భారతదేశ మొట్టమొదటి  విద్యాశాఖ మంత్రివర్యులు మౌలానా అబుల్ కాలమ్ ఆజాద్ 137 వ జయంతి మరియు జాతీయ విద్య దినోత్సవం ను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ హన్మకొండ  గ్రంథాలయంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే.  శశిజాదేవి , గ్రంథాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, లైబ్రేరియన్ పురుషోత్తం రాజు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు రాజేష్, గ్రంధాలయం పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

కాటారంలో..

కాటారం (మహాదేవపూర్), నవంబర్ 11 (విజయక్రాంతి) : భారత తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్నమౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మైనార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అస్రార్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ, కాటారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్షాద్ భాయ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, వామన్ రావు, వరప్రసాద్, కోట సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు రాఘవేంద్ర, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు నయీమ్, కడార్ల నాగరాజు, మొహమ్మద్ ఉస్మాన్ పాల్గొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి ః కలెక్టర్

ములుగు, నవంబరు 11 (విజయక్రాంతి) : స్వాతంత్య్ర సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు మంగళవారం భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న .

నేపథ్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  

ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో..

ఏటూరునాగారం, నవంబరు 11 (విజయక్రాంతి) : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం,మైనార్టీ వెల్ఫేర్ డే)కార్యక్రమంను చరిత్ర విభాగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈకార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్, డి.నవీన్ అధ్యక్షత వహించి జాతీయ విద్యా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి జ్యోతి,కనీస్ ఫాతిమా,సంపత్ జీవవేణి, రమేష్ రాజశేఖర్, శ్రీధర్ భావన, భాస్కర్, శ్రీకాంత్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.