12-11-2025 12:08:21 AM
ఎల్లారెడ్డి నవంబర్ 11,(విజయ క్రాంతి); ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర పాఠశాలలో మంగళవారం భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్ స్థానిక ఎంపీడీవో తహేరా బేగం, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, మాజీ జెడ్పిటిసి గయాజూద్దీన్ తదితరులతో కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన పలువురు బోధన బోధనేతర సిబ్బందిని సన్మానించారు. సమ్మేటివ్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ మీర్, గౌస్, అబ్దుల్ రజాక్, ఉపాధ్యాయులు బాలరాజ్, మంజూర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, ఖాజా పాల్గొన్నారు.
ఆర్.టి.ఐ ఆధ్వర్యంలో..
కామారెడ్డి, నవంబర్ 11, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి మేధావి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజా ద్ జయంతి పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని ఆర్టిఐ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్టిఐ కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు, డైరెక్టర్ సలీం లు కలిసి కేక్ కోసి మిఠాయిలు పంచారు, తదానంతరం రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రశంస పత్రాలను అందజేశారు. ఆర్టిఐ స్టేట్ డైరెక్టర్ సలీం, జిల్లా అడ్వైజర్ బి రాజేశ్వర్, మహిళా కార్యదర్శి సట్ల జమున, అన్వర్ గౌరీ, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎంబీ భాస్కర్, వి భాగ్యలక్ష్మి జిల్లా సెక్రటరీ, పాఠశాల హెడ్మాస్టర్ గంగా కిషన్, ఉపాధ్యా యులు జంగం శ్రీశైలం, అశోక్ కుమార్, సుష్మ మానస నవీన పాల్గొన్నారు.