calender_icon.png 5 August, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు

18-04-2025 01:34:43 AM

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాం తి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి వరుసగా మూడురోజుల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొంది. శుక్రవా రం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్‌కర్నూల్, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షాలు కురిసే అవ కాశముందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షం కురిసే అవకాశముంది. శనివారం పలు జిల్లాలో వర్షం కురవనుంది.