calender_icon.png 10 May, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల జీవోలను చట్టం చేయండి

18-04-2025 01:34:28 AM

ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు

గూడూరు.ఏప్రిల్ 17: (విజయ క్రాంతి): ఆదివాసీల జీవోలను చట్టం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కేంద్రంలో ఆదివాసీ సంఘాల అత్యవసర సమావేశం భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆదివాసి పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు అధ్యక్షుడు సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలోని 29 ప్రభుత్వ శాఖలలో ప్రత్యేకమైనటువంటి స్థానికత నియామకాల తో ఉద్యోగ నియామకాలు చేపట్టేది గత ఐదు సంవత్సరాల నుండి ఈ నియామకాలకు గిరిజనేతర్లు ఆటంకం కలిగిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తూ ఆదివాసి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేస్తున్నాన్నారు.

ఆదివాసి సమాజానికి న్యాయం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రిమండలి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ  యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ఆదివాసి కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి విద్య ఉద్యోగ నియామకాలలో 5వ షెడ్యూల్ ప్రాంతాలలో ఆదివాసి యువతకు చెందవలసిన  స్థానిక ఉద్యోగ నియామకాల తీర్మానం చేసి ఆమోదం కొనసాగించాలని, అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షమై సహకరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నాము.

ప్రభుత్వం ఇట్టి ఆదివాసీల డిమాండ్ పై తక్షణమే ఆదివాసీల కొరకు అసెంబ్లీ సమావేశం నిర్వహించని లేని యెడల ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను.  సంక్షేమ పరిషత్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఆగబోయిన చంద్రయ్య దొర తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య ఇక నాగేష్ సమ్మయ్య సురేందర్ నరేష్ సుధాకర్ గిరిబాబు సిద్ధవైన బాబు పాల్గొన్నారు.