మల్లన్న ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం
పటాన్చెరు, జనవరి 4: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు.
నియోజకవర్గంలో నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, శ్రీధర్ చారి, చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చర్చి ప్రహారీని ప్రారంభించిన జీఎంఆర్
పటాన్చెరు నియోజకవర్గం మొత్తంగా డివిజన్ పరిధిలోని డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ఆవరణలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభు కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు పాండు, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, రామకృష్ణ, రవి, చర్చి పాస్టర్ సిరిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.






