calender_icon.png 7 January, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలధారణతో అయ్యప్పకు ప్రత్యేక పూజలు

05-01-2026 12:27:41 AM

శబరిమలకు వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సికింద్రాబాద్ జనవరి 4 (విజయక్రాంతి): మాజీమంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యప్పస్వామి మాల ధరించి శబరిమల కు వెళ్లారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో చంద్రమౌళి (వేలు) గురు స్వామి చేతుల మీదుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యప్పస్వామి మాల ధరించారు. అనంతరం ఇరుముడి పూజ నిర్వహించారు.

పూజ అనంతరం తలపై ఇరుముడి పెట్టుకొని అయ్యప్పస్వామి దర్శ నం కోసం శబరిమలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ 45 రోజుల క్రితం అయ్యప్పస్వామి మాల ధరించగా నాటి నుండి ప్రతిరోజు వెస్ట్ మారేడ్ పల్లిలోని వారి నివాసంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు,బంధువులతో పాటు పలువురు పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్,మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ తదితరులు ఉన్నారు.