20 March, 2026 | 2:09 AM

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

20-03-2026 12:36 AM

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి): ప్రజలందరూ సుఖ సంతోషాలతో నూతన సంవత్సరంలో బాగుండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం రాత్రి వీక్లీ మార్కెట్లోని దుర్గామాత ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఉగాది ఉత్సవాల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత సంవత్సరంలో జరిగిన చెడును మరిచి నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని వేడుకుంటున్నారు తెలిపారు.

అంతకుముందు ఎడ్లబండ్ల ప్రదర్శనను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, తో పాటు సదర సంఘం ప్రతినిధులు అన్నారం మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, పెద్దలు వివిధ కుల సంఘాల ప్రతినిధులు బండ్ల ప్రదర్శన నిర్వహించారు. బండ్ల ప్రదర్శన చేపట్టిన వారందరికీ బహుమతులను సదర సంఘం ఆధ్వర్యంలో అందజేశారు.

సదర్ సంగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామిలను, కౌన్సిలర్లను సన్మానించారు. ఎడ్లబండ్ల ప్రదర్శన ప్రశాంతంగా ముగియడంతో  సదర్ సంఘం ప్రతినిధులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ముగియడంతో సదర సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణ సిఐ నరహరి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాంగ శ్రవణాన్ని వీక్షించారు.