ఊరూరా ముదిరాజుల జెండా పండుగ
గాంధారి, మార్చి, 19 (విజయ క్రాంతి ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని పలు గ్రామాల్లో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పురస్కరించుకొని ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం -1 పట్టణ నూతన కమిటీ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సంఘం సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా రెడ్డి సాయిరెడ్డి , కోశాధికారిగా మహంకాళి రమేష్, ఉప అధ్యక్షుడుగా రెడ్డి లక్ష్మణ్, కార్యదర్శిగా గుర్జాల్ స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వారు తెలిపారు.
అనంతరం ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షుడు తూర్పు రాజులు , మండల అధ్యక్షుడు రెడ్డి రాజులు ఆధ్వర్యంలో ముదిరాజు ల జెండా ఎగురవేసి ఉగాది సంబరాలు జరుపుకున్నారు. పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంఘం సభ్యులు అందరూ ఉగాది పచ్చడి సేవించి పండగ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు లైన్ రమేష్, కామెల్లి బాలరాజు, నీల రవి, తూర్పు శేఖర్, సంతోష్, రమేష్, రవి, వెంకట్ రాజు, నరేష్, సింధూర్, సంపత్, గణేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.




