2 May, 2026 | 2:28 AM

ఘనంగా మేడే

02-05-2026 01:10 AM

శ్రీగణేష్ ఆటో యూనియన్, సీఐటీయూ ఆద్వర్యంలో.

ఆటో కార్మికుల భారీ ర్యాలి, నృత్యాలతో హోరెత్తిన మండల కేంద్రం .

చర్ల, మే 1 (విజయక్రాంతి): మండల కేంద్రంలో మే డే సందర్భంగా శ్రీగణేష్ ఆ టోయూనియన్ సిఐటియు ఆద్వర్యంలో భారీ ఆటో ర్యాలి నిర్వహించారు. వందలాది ఆటోలతో నృత్యాలు, డీజే  ఎర్రజెండా, పాటలతో అత్యంత ఉత్సహాంగా  ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జెండాను యూనియన్ అధ్యక్షులు పామరు బాలాజి బస్టాండ్ సెంటర్ లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ర్యాలి సభనుద్దేచించి సీఐటీయూ జిల్లా అద్యక్షులు కె.బ్రహ్మాచారి మాట్లాడారు.కార్మిక పోరాటాలకు,త్యాగాల ప్రతీక మేడే అని అన్నారు.ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఉచితబస్సు పధకం వల్ల ఆటోకార్మికులు ఉపాది కరువైందన్నారు.ఆటోకార్మికులు ప్రభుత్వ హావిుప్రకారం 12000/-ఇవ్వాలనిడిమాండ్ చేశారు. గణేష్ ఆటోయూనియన్ జెండాలు సిఐటియు జెండాలతో అలకరించిన ఆటోలతో చర్ల మండలకేంద్రం ఎరుపెక్కింది.ఎర్రజెమడా పాటలతో చర్ల కేంద్రం హోరెత్తిపోయింది.పోరాటాలద్వారానే హక్కుల రక్షించబడతాయని,సీఐటీయూ జెండా కార్మికులకు కొండంత అండ అన్నారు.

అనంతరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  శ్రీగణేష్ ఆటో యూనియన్ సిఐటియు గౌరవఅద్యక్షులు తెల్లమల్లఅజయ్ కుమార్ కార్యదర్శి కోడిరెక్కల నాగరాజు,ఉపకార్యదర్శిచల్లా అశోక్ కుమార్, ఉపాద్యక్షులు దనసరిసంపత్,బాలరాజులసత్తిరాజు, యూత్ ప్రెసిడెంట్ కంచర్ల సతీస్, జింజిరాల తులసిరామ్, కోశాధికారి, కుక్కడపురాజ బాబు, పాములపోతురాజునాయకులు పొగాకు నాగేంద్రకుమార్, కొంగారాజుదొంతుప్రసాద్, వల్లెపోగువిజయ్, సంజీవ్ , వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ ఆధ్వర్యంలో

ఆళ్ళపల్లి, మే 1, (విజయక్రాంతి): వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని వర్కోడు గ్రామంలో మండల కార్యదర్శి కొమరం హనుమంతు అధ్యక్షతన జరిగిన జండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో భగత్ సింగ్ స్తూపం వద్ద వేడుకలలో రేసు ఎల్లయ్య మాట్లాడుతూ...1886లో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని ఆయన తెలిపారు.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారని దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారని,కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారని  రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ అన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరెడ్ల రాంబాబు వజ్జ పగడయ్య, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంట సహదేవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే రహీం, మాజీ ఉపసర్పంచ్ మలిపెద్ది లాజర్ తదితరులు పాల్గొన్నారు.