16 August, 2026 | 6:33 PM

చలనచిత్ర టీవీ కళాకారులను ప్రోత్సహించాలి

16-08-2026 05:00 PM

నిర్మల్ ,ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం టీవీ చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న కళాకారులను ప్రోత్సహించి ఆదుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఒడిసెర్ల రాజు తెలిపారు. ఆదివారం టీఎన్జీవో కార్యాలయంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించారు చలనచిత్ర , టీవీరంగంలో పనిచేస్తున్న కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చిన్న సినిమాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోటగిరి కోటగిరి నర్సయ్య చారి ప్రధాన కార్యదర్శిగా తీరుకోవల రవి కోశాధికారియ సామర్ల రాజన్న ఉపాధ్యక్షుడిగా కమలాకర్ మేరీ మాత సంయుక్త కార్యదర్శిగా హరీష్ బాబు కృష్ణ వర్మ ప్రచార కార్యదర్శిగా నరేందర్ తో పాటు పంపి సభ్యులను ఎన్నుకున్నారు.