16 August, 2026 | 6:33 PM

వడగండ్ల వాన బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

16-08-2026 05:02 PM

కోనరావుపేట ఆగష్టు 16(విజయక్రాంతి): వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ కోనరావుపేట మండల శాఖ అధ్యక్షుడు మిర్యాల్ కార్ బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. గతంలో వడగండ్ల వాన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చి అధికారులతో పంట నష్టం సర్వే చేయించిందన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు నష్టపోయిన ప్రాంతాలను సందర్శించినప్పటికీ ఇప్పటివరకు బాధిత రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని ఆరోపించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వడగండ్ల వాన బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో అజ్మీర తండా సర్పంచ్ అజ్మీర జయరాం, మండల ఉపాధ్యక్షులు చింతల పరుశరాములు, చీకటి మధు, బూత్ అధ్యక్షులు ధూర్ల శంకర్, పొన్నం మహేష్, చౌటపల్లి వెంకన్న, పిల్లి వెంకటేష్, దుండిగల బాలరాజ్, మల్లెబోయిన విజయ్, డాక్టర్ మల్లయ్య, మోతుకు భాను, కస్తూరి సంజీవరెడ్డి, చక్రాల పరుశురాములు, అజ్మీర కళ్యాణ్, లౌడియా తిరుపతి, లకవత్ శ్రీహరి, లకవత్ దేవేందర్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.