గ్రామ గ్రామాన" మేడే" జెండా ఎగురవేయాలి
ఎరవెల్లి ముత్యం రావు, తాండ్ర అంజయ్య
సుల్తానాబాద్,(విజయక్రాంతి): 140వ మేడే కరపత్రాలను మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైస్ మిల్ అసోసియేషన్ కెనాల్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్యలు మాట్లాడుతూ... ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జిల్లాలోని కార్మిక వర్గం గ్రామ గ్రామాన పతాకావిష్కరణతో సంఘటితశక్తిని ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు.
నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసి యజమానులకు లాభం చేసి నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చిందని, దీనితో 8 గంటల పని విధానం 12 గంటలకు మారుతుందని, ఈ ప్రమాదకరమైన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ మేడే జరుపుకోవాలని అన్నారు. 140 సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని దినం అమలు కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఎనిమిది గంటల పని దినం హక్కును కాపాడుకుంటామని ప్రతిన భూనాలని అదే చికాగో అమరులకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి చేయకపోగా ఉన్న హక్కులను, చట్టాలను, సౌకర్యాలను తొలగిస్తున్నాయని ఇది కార్మిక వర్గానికి ఒక సవాలుగా మారిందని, పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదులు కలిసి కార్మిక వర్గంపై చేస్తున్న ఈ దాడిని ఎదుర్కోవడానికి అన్ని రంగాల కార్మికులు సంగటిత శక్తిని ప్రదర్శించి హక్కులను, సౌకర్యాలను, చట్టాలను కాపాడుకోవడానికి దీక్ష భూనాలని, అందుకే ఈ మేడేను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అందుకు మొత్తం కార్మిక వర్గం జెండా ఆవిష్కరణలు,ప్రదర్శనలు, సభలు ద్వారా తమ యొక్క ఆకాంక్షను వెలుబుచ్చాలని,
అందుకు సమయం ఆసన్నమైందని కావున జిల్లాలోని కార్మిక వర్గం మొత్తం ఈ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు, కిరణ్, శంకరయ్య,పర్వతాలు, చిలుముల రాజయ్య, రాజు, లింగయ్య, శ్రీకాంత్, రమేష్, సంతోష్, సుధాకర్ రావు, శీను, రవి, ఓదెలు, రాము, వసంత్, రాజేశం, మహేందర్, విలాస్, రవీందర్, అబ్బాస్, నవీన్, రఘుపతి రెడ్డి, ప్రభాకర్, వేణు, మహేష్ తదితరులు పాల్గొన్నారు,






