28 April, 2026 | 7:30 PM

భద్రాచలంలో హిందూ సమ్మేళనం

28-04-2026 06:15 PM

కరపత్రాల ఆవిష్కరణ

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో మే 3 ఆదివారం జరగనున్న “హిందూ సమ్మేళనం”* కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు దశలవారీగా వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భద్రాచలం పట్టణంలో హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్  నివాసంలో కరపత్రాలను ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ... హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం మరియు ధార్మిక విలువలను బలపరచడం ఈ సమ్మేళన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన సమన్వయ సమావేశాల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షించామని, ఇప్పుడు కరపత్రాల విడుదలతో గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రచారాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.