14 July, 2026 | 3:35 AM

బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్‌ విజయలక్ష్మి ఆగ్రహం

06-07-2024 11:29 AM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభమైంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీనే ప్రోత్సహించిదని మేయర్ ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జీహెచ్ఎంసీ మేయర్ పోడియంను కార్పొరేటర్లు చుట్టుముట్టారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఆందోళనకు దిగారు. మేయర్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.