2 May, 2026 | 6:57 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మియాపూర్‌లో ఎండిఏంఏ డ్రగ్స్ కలకలం

05-03-2026 12:00 AM
  1. ముగ్గురు నిందితుల అరెస్ట్

12.6 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం

శేరిలింగంపల్లి, మార్చి 4 (విజయక్రాంతి): భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపింది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండిఏంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నింది తులను అదుపులోకి తీసుకున్నట్లు మియాపూర్ సీఐ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీ య సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం సమయంలో విశ్వంభర కాలనీ పార్క్ సమీపంలో ఒక వోక్స్ వ్యాగన్ కారు లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు.

దీనిపై వెంటనే స్పందించిన మియాపూర్, మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసు బృందం అక్కడికి చేరుకుని సదరు వాహనాన్ని తనిఖీ చేశారు. పోలీసులను గమనించి నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అదుపు లోకి తీసుకున్నామన్నారు. వాహనాన్ని క్షు ణ్ణంగా తనిఖీ చేయగా, కార్ డ్యాష్ బోర్డ్‌లో తెల్లటి క్రిస్టలైన్ పదార్థం లభ్యమైందన్నారు. డ్రగ్ డిటెక్షన్ కిట్తో పరీక్షించగా అది 12.6 గ్రాముల ఎండిఏంఏగా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

నిందితులు బేరి హనుమంతు (27), భూమని మహేష్ (26), కాసం ఆదర్శ్ (28)లను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా వీరు బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో అధిక లాభాలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్దనుంచి డ్రగ్స్‌తోపాటు, ఒక వోక్స్ వ్యాగన్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.