12 April, 2026 | 12:54 AM

గ్రామ అభివృద్ధికి చర్యలు

25-12-2025 02:18 AM

బెజ్జూర్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): బెజ్జూరు గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సర్పంచి దుర్గం సరోజ అన్నారు. బుధవారం   గ్రామపంచాయతీ కార్యాలయం లో తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. బెజ్జూర్ మండల కేంద్రంలో మరుగు దొడ్ల నిర్మాణం కోసం, తీర్మానించారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

గ్రామపంచాయతీ పరిధి లోని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డ్‌ల వారీగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఏటి కూడా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్, కార్యదర్శి వైకుంఠం. వార్డు సభ్యులు పాల్గొన్నారు.