25-12-2025 02:20:23 AM
ఉట్నూర్/నిర్మల్, డిసెంబర్ 24, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు తో పాటు సదర్ మాట్ లోని సాగునీటిని చివరి ఆయకట్టు వరకు అందించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో సాగునీటి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భం గా సాగునీటి శాఖ అధికారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మరమ్మత్తులపై అటవీ శాఖ నుంచి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. కడెం ప్రాజెక్టుకు మహర్దశ తో పాటు ఇతర సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్యే అన్నారు.
సరస్వతి కెనాల్‌కు నీటి విడుదల
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా నిర్మల్ జిల్లాలోని ఆయకట్టు రైతులకు బుధవారం నీటిని నేటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ప్రతిరోజు 300 క్యూసెక్కుల నీటిని సరస్వతి కెనాల్ ఆయకట్టు రైతులకు అందించడం జరుగుతుందని వారబంది రూపంలో నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఏఈ మాధురి వెల్లడించారు.