calender_icon.png 25 December, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి ఎంపిక

25-12-2025 02:17:21 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్24( విజయ క్రాంతి): ఆశ్రమ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కోట్నాక రోషన్ రాష్ట్ర స్థాయి సీనియర్ బాలుర కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్ 23న ఆసిఫాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్రీడా పాఠశాలలో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో కోట్నాక రోషన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ నెల 25 నుంచి 28 తేదీల వరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న సీనియర్ బాలుర రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో అతను పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనక కర్నూ , పాఠశాల పీడీ హీరాబాయి తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, డీవైఎస్‌ఓ అష్ఫాక్ అహమ్మద్, గిరిజన క్రీడల అధికారి మడవి షేకు, ఆసిఫాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, కబడ్డీ సెక్రటరీ ఆత్రం ధర్మారావు, ఏసీఎంఓ ఉద్దవ్, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ శివకృష్ణ, హెచ్డబ్ల్యూఓ మధుకర్, గోపాల్, కిరణ్, చంద్రశేఖర్, జగేష్, ఖేలో ఇండియా కోచ్ కడతల రాకేష్తో పాటు పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.