ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలి
శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్
శంకర్‌పల్లి, బుధవారం 15(విజయ క్రాంతి) : ప్రభుత్వ పథకాలను అర్హులకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు గ్రామస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.
99 రోజుల కార్యచరణలో భాగంగా పనులను వేగవంతం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ గ్రామ స్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తమ తమ గ్రామాల పరిధిలో జరుగుతున్న పనులపై నివేదికను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరి రాజు, ఏపీఎం నాగభూషణం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






