వర్షం కోసం శివలింగం నీటినిర్బంధం
30-06-2026 12:19 AM
నిర్మల్ జూన్ 29 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా అతి ప్రాచీన దేవాలయమైన శ్రీ కదిలి అన్నపూర్ణ కాపేశ్వర స్వామి ఆలయంలో వర్షాల కోసం సోమవారం శివలింగాన్ని నీటితో నింపారు. భక్తులు రైతులు గోదావరి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి చేరుకొని శివలింగం శివలింగాన్ని అభిషేకం చేసి నీటితో నింపివేశారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని రైతుల విశ్వాసం. పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్మించినట్లు సమీప గ్రామాల రైతులు తెలిపారు.






