27 June, 2026 | 1:34 AM

ఖరీఫ్ సీజన్‌కు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

27-06-2026 12:00 AM

పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి

చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలి

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంటలు విద్య సమయం ఆసన్నం ఆయన సందర్భంగా ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పంట మార్పిడి ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని అధికారికంగా రైతులకు కలగాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా కేంద్రం తో సహా గ్రామాల్లో చెరువుల్లో కుంటలు నీరు వచ్చిపోయే కాలువలు పొడుగ తీయించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. చెట్లు మొక్కలు లేకుండా చూడాలన్నారు. గత సంవత్సరం వదల కారణంగా ఏర్పడిన బుంగలు అరుగుల మరమ్మతులు చేయించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.