27 June, 2026 | 1:31 AM

బైకును ఢీకొన్న జింక

27-06-2026 12:00 AM

భార్య భర్తలకు గాయాలు 

కామారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): అడవి బాట పట్టాల్సిన వన్య ప్రాణులు జనం బాట పడుతున్నాయి. ఓ జింక శుక్రవారం కామారెడ్డి పట్టణ సమీపంలో కామారెడ్డి రామారెడ్డి రహదారిపై బైక్ పై వస్తున్న భార్యాభర్తలను ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మేదరి శ్రీనివాస్ అతని భార్య గంగమనితో కలిసి కామారెడ్డి కలెక్టరేట్లో పని ముగించుకొని స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కనుంచి సడన్ గా జింక అడ్డు రావడంతో స్క్రూటీపై వెళ్తున్న భార్యాభర్తలు కింద పడిపోయారు. మేదరి శ్రీనివాసుకు కాలు విరుగగా అతని భార్య గంగామణికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ గా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పేర్కొన్నారు.