తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి
24-04-2026 01:12 AM
తాడ్వాయి, ఏప్రిల్, 22( విజయ క్రాంతి): గ్రామంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గానికి అధికారులు సూచించారు. ఈనెల 22న విజయ క్రాంతిలో ప్రచురితమైన రెండు రోజులకోసారి నీళ్లు..అనే వార్తకు అధికారులు స్పందించారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామాన్ని గురువారం ఆర్ డబ్ల్యూఎఫ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో తిరిగి నీటి సమస్యను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఏమైనా తాగునీటి ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.మరోసారి గ్రామంలో రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.






