25 June, 2026 | 9:34 PM

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

29-05-2025 03:02 AM

మేడ్చల్, మే 28(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

బుధ వారం ఎమ్మెల్యే మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందున మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబల అవకాశం ఉందన్నారు.

కింది బస్తీలో తాను ఇటీవల పర్యటించానని, అక్కడ అపరిశుభ్రంగా ఉందన్నారు. పారిశుధ్యం పై దృష్టి పెట్టాలన్నారు. మల్లారెడ్డి ఫోన్ చేసిన సమయంలో బి ఆర్ ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, మాజీ ఎంపీపీ జగన్ రెడ్డి తదితరులున్నారు.