16 April, 2026 | 10:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యం

29-05-2025 03:00 AM

ఏఎంసి డైరెక్టర్ సంపత్ 

 ఆమనగల్లు, మే 28: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంపత్ అన్నారు బుధవారం మాడల మండలంలోని నల్లవారి పల్లి గ్రామంలో మొదటి విడతలో మంజూరైన 18 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండకు సంబంధించిన ప్రొసీడింగ్లను గ్రామ కార్యదర్శి హరికృష్ణ కుమార్  తో కలిసి ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామిని నిలబెట్టుకుంటుందని అరులందరికీ  సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నల్లవారి పల్లి గ్రామానికి మొదటి విడత కింద 18 ఇండ్లు మంజూరు అయినట్లు ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే  ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేశామని... ఎమ్మెల్యే  సహకారంతో  గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులంతా  ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆయన కోరారు.

కార్య క్రమంలో మాడుగుల మండల మహిళా అధ్యక్షురాలు విజయ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పెద్దయ్య,వెంకటయ్య, దేవేందర్,వెంకట్ రెడ్డి, పార్టీ నాయకులు మల్లయ్య,జగన్ రెడ్డి అంజలి పాల్గొన్నారు.