16 April, 2026 | 7:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కుక్కల దాడిలో 40 గొర్రెల మృత్యువాత

29-05-2025 03:03 AM

-భాధిత కుటుంబాన్ని పరామర్శించిన 

-మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్  అందెల శ్రీరాములు యాదవ్

మహేశ్వరం, మే 28: వీదికుక్కల దాడిలో 40కి పైగ గొర్రెలు మృత్యువాత పడడం అత్యంత బాధాకరమైన విషయమని బిజెపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని దయ్యాల గుండుతండాకి చెందిన రామవత్ డాక్య నాయక్ వృత్తిరీత్యా గొర్లను మేపుకుంటూ జీవనోపాధి కొనసాగించేవారు. మంగళవారం రాత్రి షెడ్డులో ఉన్న  గొర్రెలను వీధి కుక్కలు దాడి చేయడంతో 40కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇట్టి విషయం పార్టీ నేతలు అందెల శ్రీరాములు యాదవ్  దృష్టికి తీసుకువచ్చారు. 

బుధవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,జిహెఎంసి అధికారులు వీధికుక్కలను తీసుకువచ్చి గ్రామాల పరిసర ప్రాంతాల్లో వదిలిపెడుతుంటే గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

వీధి కుక్కలు గొర్రెలపై దాడి చేశాయని,అదే వారి పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని ఆయన అధికారులను నిలదీశారు. గ్రామాలలో వీధి కుక్కల సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం డాక్యనాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు యాదీష్,కిసాన్ మోర్చా జాతీయ నాయకులు పాపయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సభ్యులు సుదర్శన్ యాదవ్, బిజెవైఎం మండల అధ్యక్షుడు వణంపల్లి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.