గోదాంలో స్టోరేజ్.. వెంట వెంటనే అన్‌లోడింగ్
29-05-2026 12:40 AM
రంగంలోకి మార్కెట్ కమిటీ చైర్మన్
కొత్తపల్లి, మే28 (విజయక్రాంతి): కరీంనగర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు వేగవంతంపై మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గురువారం ఉదయమే మార్కెట్ యార్డ్ కు చేరుకొని కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన లోడింగ్ ప్రక్రియ ముమ్మరం చేశారు.
లారీలు ట్రాక్టర్లలో వరి ధాన్యము మొక్కజొన్న లోడింగ్ అయిన వెంటనే గోదాముల్లో స్టోరే జ్ చేసేందుకు వెంటవెంటనే అన్లోడింగ్ చేయిస్తున్నారు. దీనిపై మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అకాల వర్షానికి నడిచిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.






