చివరి గింజ వరకూ కొంటాం
నగునూర్ కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్
కరీంనగర్ రూరక్, మే28 (విజయక్రాంతి): వరి ధాన్యం చివరి గింజ వరకూ కొంటామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ మండలం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి అక్కడినుండే అధికారులతో మాట్లాడి ప్రత్యేక గోదాంలను కేటాయించే విధంగా సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులతో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చివరి గింజవరకూ కొనుగోలు చేస్తామని వారంలోగా సెంటర్ ఎత్తి వేస్తామని అకాల వర్షాలు పడ్డా రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.
వాహనాల కొరత, హమాలీల కొరత వల్ల అక్కడక్కడ కొంత ఇ బ్బంది ఏర్పడిందని అయినప్పటికీ రైతుకు ఎటువంటి నష్టం కలుగనీయమని నరేందర్ రెడ్డి అన్నారు. సుడా చైర్మన్ వెంట పెంచాల లక్ష్మణ్ రావు,ఉప సర్పంచ్ హన్మంత రావు, సెంటర్ ఇంచార్జి అజయ్,అశోక్ రెడ్డి,కృష్ణా రెడ్డి, సాయిల్ల రాజు,శేఖర్ తదితరులు ఉన్నారు.






