17-05-2025 12:00:00 AM
అవగాహన కల్పిస్తున్న విస్తీర్ణ అధికారి సంతోష్
కంగ్టి, మే 16 : వర్షాకాలంలో కురిసిన ప్ర తి నీటి బొట్టుని మన పొలంలోనే నీటి కుంటలు ,కందకాలు అనే నిర్మాణాల ద్వారా దాచుకుంటే భవిష్యత్తులో ఆ నీటిని వివిధ రకా లుగా మనకు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని వ్యవ సాయ విస్తీర్ణాధికారి సంతోష్ నాగూర్ కే క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ముఖ్యంగా కంగ్టి మండల ప్రాంతా లలో రైతులు బోరు బావులు తవ్వి చాలా వరకు భూగర్భం లో నీళ్ళు లభించక పోవ డం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇలా బో రు భావులపై ఆధారపడకుండా రైతులు త మ పొలం లోతట్టు ప్రాంతాల్లో అనుకూలమైన సైజుల్లో నీటి కుంటల నిర్మాణాన్ని ని ర్మించుకుంటే వానాకాలం లో కురిసే ప్రతి వర్షపు చినుకును ఒడిసి పట్టుకొని మన పొలంలో ఇంకే విధముగా చేసుకుంటే భవిష్యత్తులో భూగర్బ జలo పెరగడం తో పాటునీటి కుంటలో నిలువ ఉన్న నీటితో పంటకు నీరు అందించే అవకాశం ఉంటుందన్నారు.నిలువ ఉన్న నీటిలో చేపల పెం పకం తో అదనపు ఆదాయం కూడా ఆర్జించే అవకాశం కూడా ఉంటుందని రైతులకు వివరించారు.