calender_icon.png 8 January, 2026 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాదెపాడులో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

07-01-2026 12:31:43 PM

కారేపల్లి (విజయ క్రాంతి): కారేపల్లి మండలం గాదెపాడులో వేసవీ కాలం లో త్రాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టుతున్నట్లు సర్పంచ్ భూక్య రంజిత్ కుమార్ తెలిపారు. గాదెపాడులో మంచినీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ పనులు సర్పంచ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలో సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారంకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సహకారంతో కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు తన నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు.