28 July, 2026 | 12:34 AM

మెకానిక్‌లు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి

28-07-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, జూలై 27 (విజయక్రాంతి): మెకానిక్ లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ ఎస్త్స్ర లీ ఏ సురేష్, బీ రామ్మూర్తిలు సూచించారు. సోమవారం నగరంలో అల్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.

ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లా డుతూ నేటి సమాజంలో ప్రజలు ట్రాఫిక్ సమస్య లతో సతమ తమౌతున్నారని, హెల్మెట్ ధరించకుం డా, నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్నారని, దీం తో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హచ్ ఆయిల్ కంపెనీ ఏఎస్‌ఎం సునీల్ కుమార్, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహేష్, కార్పొరేటర్ మాసం గణేష్, లీగల్ అడ్వైజర్ లుక్క రాజేశం, సభ నిర్వాహకులు వై ఎస్ శర్మ, సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసా చారి, కార్యదర్శి బాకం ఆంజనేయులు, మచిలీపట్నం అధ్యక్షులు సుబ్బారావు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.