28 July, 2026 | 12:32 AM

ప్రజావాణి ఫిర్యాదుపై అరగంటలోనే కలెక్టర్ తనిఖీ

28-07-2026 12:00 AM

సిరిసిల్ల, జులై 27 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే స్పందించి చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల భోజన నాణ్యత, హాస్టల్ వసతులు, నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపాల్ను హెచ్చరించిన కలెక్టర్, విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.