21-02-2026 12:09:52 AM
మేడారంపై కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాం తి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. లివింగ్ హెరిటేజ్ విభాగంలో ఇప్పటికే బెంగాల్‌లో దుర్గా పూజ, దీపావాళి పండుగలకు హెరిటేజ్ హోదా లభించిన నేపథ్యంలో మేడారం జాతరకు కూడా అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మేడారం జాతరకు కూడా గుర్తింపు వచ్చే దిశగా చరిత్రకారు లు, సామాజికవేత్తలు, అనుభవజ్ఞులు, అంత్రోపాలజిస్టులు కలిసి పనిచే యాలని పిలుపుని చ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన శుక్రవారం ‘సమ్మక్క జాతర’ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీతక్క ముఖ్య అతిథిగా హాజరై కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్టును మంత్రి సీతక్క అభినందించారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌కు మంత్రి అభినందనలు
మేడారం జాతర అరుదైన చిత్రాలను సంకలనం చేసి కాఫీ టేబుల్ బుక్ రూపంలో తీసుకువచ్చిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. కాకతీయ హెరిటేజ్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లను మంత్రి శాలువాలతో సత్కరించారు. ప్రముఖ సినీ దర్శకుడు కాఫీ టేబుల్ బుక్ ఎడిటర్ బీ. నర్సింగరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బీ.వీ. పాపారావు, బీ.పీ ఆచార్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. రతన్,
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ ప్రొఫెసర్ ఎం. పాండు రంగారావు, జే. శ్రీధర్ రావు, ప్రముఖ పేయింటర్ ఏలే లక్ష్మణ్, ఫొటోగ్రాఫర్లు రామ వీరేశ్ బాబు, పీ.విజయ భాస్కర్ రెడ్డి, శరత్ బాబు, డీ.ఎం. అర్జున్, శ్రీశైలం, అన్నవరం శ్రీనివాస్, సజన్ పున్న, అనుమల్ల గంగాధర్, సత్యనారాయణ గొల్ల, రవీందర్ రెడ్డి, కందుకూరి రమేష్ బాబు, వినీద్ బాబు వీ. బిలుక ప్రభాకర్, ఎన్.ఆర్. సుధాకర్ గౌడ్ సేవలను కొనియాడారు. వారి ఫొటోలు జాతర వైభవాన్ని సజీవంగా ఆవిష్కరించాయని ప్రశంసించారు.